ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంచైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

📰 Generate e-Paper Clip

చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. హునాన్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 61 మందికి గాయాలయ్యాయి.

ఇంటర్నెట్ డెస్క్ మే 5 ( మహాప్రభ ) : చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్‌ నగరంలో సోమవారం సాయంత్రం వేళ ఓ బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తిమంతమైన పేలుడు సంభవించింది. గ్వాండ్ టౌన్‌షిప్‌లోని లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్‌వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు చెందిన కర్మాగారంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టడం సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా నియమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు.

కాగా.. గతేడాది నవంబర్‌లోనూ హాంకాంగ్‌లోని ఓ కోర్టు సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 168 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!