ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు

📰 Generate e-Paper Clip

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తన ఆత్మకథ ‘కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్’ లో జేడీ వాన్స్ పంచుకున్నారు.

మే 13 ( మహాప్రభ ) :ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తన ఆత్మకథ ‘కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్’ లో జేడీ వాన్స్ పంచుకున్నారు. ఉషా చిలుకూరితో పరిచయం, తమ వైవాహిక జీవితం గురించి ఆ పుస్తకంలో వాన్స్ వివరించారు (JD Vance wife).

యేల్ లా స్కూల్‌లో చదువుతున్న సమయంలో ఉషా చిలుకూరిని కలిశానని, ఆ తర్వాత తన జీవితమే మారిపోయిందని వాన్స్ పేర్కొన్నారు. ‘ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉంటాను’ అని అప్పట్లో తన స్నేహితులకు చెప్పినట్లు వాన్స్ వెల్లడించారు. అందం మాత్రమే కాకుండా, ఆమె తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, సాంప్రదాయ విజయాలపై ఆసక్తి లేకపోవడం తనను ఆకర్షించాయని తెలిపారు. ఇతరులతో పోలిస్తే ఆమె చాలా భిన్నంగా అనిపించిందని చెప్పారు (JD Vance love story).

తెలుగు మూలాలు కలిగిన కుటుంబానికి చెందిన ఉష 2014లో జేడీ వాన్స్‌ను వివాహం చేసుకున్నారు (Usha Chilukuri). హిందూ సాంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉష త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!