ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..

నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..

📰 Generate e-Paper Clip

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.

మహారాష్ట్ర మే 13 ( మహాప్రభ ) : నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈరోజు (బుధవారం) ఉదయం రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్, దినేశ్‌ను అదుపులోకి తీసుకోగా.. తాజాగా పుణెకు చెందిన ఓ మహిళను విచారణ నిమిత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ కేసుతో సదరు మహిళకు సంబంధం ఉందని అనుమానించిన పుణె పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని సీబీఐకి అప్పగించారు. నిందితురాలిని బిబ్వేవాడి ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. తాము విచారించిన అనంతరం సీబీఐ అధికారులకు అప్పగించామని చెప్పారు. అయితే, ఈ కేసులో ఆమె కచ్చితమైన పాత్రను వివరించేందుకు కమిషనర్ నిరాకరించారు. కాగా, అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.

ఈ పరీక్ష రాసేందుకు 23 లక్షల మంది నమోదు చేసుకోగా, 96.92 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష రద్దు కావడంతో 23 లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పేపర్ లీక్ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు మండిపడుతూ ఆందోళనకు దిగుతున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!