చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి
చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. హునాన్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 61 మందికి గాయాలయ్యాయి. ఇంటర్నెట్ డెస్క్ మే 5 ( మహాప్రభ ) : చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం వేళ ఓ బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తిమంతమైన పేలుడు సంభవించింది. గ్వాండ్ టౌన్‌షిప్‌లోని లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్‌వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు చెందిన కర్మాగారంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు....