ePaper
Tuesday, July 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్, షర్మిల

సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్, షర్మిల

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీబీఎన్ గారు! మీరు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పారు. ఈ మేరకు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ షర్మిల..

సీఎం చంద్రబాబుకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సీబీఎన్‌కు వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

మరోవైపు సీఎం చంద్రబాబుకు ఇప్పటికే ఆయన కేబినెట్‌లోని మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సైతం సీఎం చంద్రబాబుకు వేర్వేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!