ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీబీఎన్ గారు! మీరు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పారు. ఈ మేరకు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ షర్మిల..
సీఎం చంద్రబాబుకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సీబీఎన్‌కు వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.