ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ప్రేమ పేరుతో మోసాలు.. యువతను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

ప్రేమ పేరుతో మోసాలు.. యువతను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

📰 Generate e-Paper Clip

ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు.

  • ఆన్‌లైన్ ప్రేమల్లో సైబర్ మోసాలు
  • వాలెంటైన్స్ డే సందర్భంగా ఇందూరు యువతకు హెచ్చరిక

ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే (Valentines Day) ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు.

ఇందూరు, ఫిబ్రవరి 14 మహాప్రభవ్యాలెంటైన్ అంటే ప్రేమ బహుమతులు, బావోద్వేగాల వేడుక. అయితే ఇదే సందర్భాన్ని కొన్ని సైబర్ మోసగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు, మేసేజింగ్ ప్లాట్‌ల ద్వారా పరిచయం పెంచుకుని భావోద్వేగాలను వాడుకుని దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయి.

ఫేక్ ప్రొఫైల్‌లతో పరిచయాలు..

ప్రత్యేకంగా యువతనే లక్ష్యంగా చేసుకుని షేక్ ప్రొఫైల్‌లతో పరిచయం మొదలుపెట్టి, కొద్ది రోజుల్లోనే ప్రేమ పేరుతో దగ్గరవుతున్నారు. ఆ తర్వాత విదేశాల్లో గిఫ్ట్ పేరుతో డబ్బు అడగడం, వ్యక్తిగత ఫొటోలు పంపించమని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీడియో కాల్స్‌ను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసే కేసులు కూడా నమోదవుతున్నాయి.

ఆర్ధిక లావాదేవీలు చేయొద్దు..

సైబర్ క్రైమ్ విభాగం అధికారుల ప్రకారం, పరిచయం అయిన వ్యక్తుల నిజ స్వరూపం తెలుసుకోకుండా ఆర్థిక లావాదేవీలు చేయడం ప్రమాదకరం. తెలియని లింకులు క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచిస్తున్నారు. మోసపోయినట్లయితే వెంటనే 1990 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!