ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?

📰 Generate e-Paper Clip

ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఇవాళ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ముంబై, ఫిబ్రవరి 14 మహాప్రభ: ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ (Mumbai Metro Pillar Collapse) ఇవాళ(శనివారం) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగ్రాతులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ములుంద్ వెస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా నిర్మాణంలోని పిల్లర్ కూలిపోవడంతో అక్కడ ఉన్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పిల్లర్ కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. రక్షణ చర్యలు కొనసాగుతుండగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!