ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంవెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్

వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్

📰 Generate e-Paper Clip

ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌ సోమవారం 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్ మే 4 ( మహాప్రభ ) : ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌ (Trisha Krishnan) ఈరోజు (సోమవారం) 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) సోషల్ మీడియా వేదికగా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తిరుమల వేంకటేశ్వర స్వామి(Tirumala Venkateswara Temple) ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి’ అని ఆయన పేర్కొన్నారు. త్రిష జన్మదినం, తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒకేరోజు రావడం, ఆమె కోరుకున్న విధంగానే ఫలితాలు ఉండటంతో బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

విజయ్ విజయం కోసం త్రిష ప్రార్థన?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు ముందు ఈరోజు (సోమవారం) త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సహా తన సన్నిహిత మిత్రుడు, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ ఘన విజయం సాధించాలని ఆమె ప్రత్యేక పూజలు చేసినట్లు ప్రచారం సాగుతోంది.

అభిమానుల సందడి..

తిరుమలలో త్రిషను చూసిన అభిమానులు.. తమిళనాడు ట్రెండ్స్‌లో విజయ్ పార్టీ దూసుకుపోతుండటంతో ‘విజయ్ గెలుస్తున్నారు మేడమ్.. కంగ్రాటులేషన్స్’ అంటూ ఆమెకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో విజయ్ ప్రభంజనం..

ప్రస్తుతం అందుతున్న ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ప్రకారం.. టీవీకే చీఫ్ విజయ్ అనూహ్య రీతిలో 105కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నారు. దశాబ్దాలుగా ఏలుతున్న ద్రవిడ పార్టీలకు(DMK, AIADMK) గట్టి పోటీనిస్తూ విజయ్ సునామీ సృష్టించే దిశగా దూసుకెళ్తున్నారు. త్రిష తన జన్మదినాన్ని ఇలాంటి ఓ చరిత్రాత్మక విజయంతో కలిపి జరుపుకోవడం ఆమె అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!