ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఫర్నీచర్ షాపులో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి..

ఫర్నీచర్ షాపులో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి..

📰 Generate e-Paper Clip

నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు మరో వ్యక్తి. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్‌లో ఆదివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది.

హైదరాబాద్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు మరో వ్యక్తి. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. రెహానా అనే వ్యక్తి సులేమాన్ నగర్‌లోని ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 11.42 గంటల సమయంలో రెహానా షాపులో నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న అతడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ రెహానాని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. ‘ రెహానా కూలర్ పక్కన నిద్రిస్తున్నాడు. అతడికి కొద్ది దూరంలో ఉన్న సోఫాలో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి రెహానా దగ్గరకు వచ్చాడు. కత్తితో రెహానాపై విచక్షణా రహితంగా దాడి చేయటం మొదలెట్టాడు. దాదాపు పదికిపైగా సార్లు కత్తితో దాడి చేశాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రెహానా కొద్దిసేపు సోఫాలో కూర్చుండిపోయాడు. తర్వాత అక్కడినుంచి చేతికి అయిన గాయం వైపు చూసుకుంటూ వెళ్లిపోయాడు. 44 సెకన్ల ఆ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!