ePaper
Wednesday, August 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeటీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

📰 Generate e-Paper Clip

టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడనుందని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సారథిగా సంజు శాంసన్ పేరు వినిపిస్తోంది.

స్పోర్ట్స్ డెస్క్ మే 9 ( మహాప్రభ ) : టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడనుందని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సారథిగా శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించగా.. తాజాగా వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌ కూడా రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అప్పుడు కొత్త సారథిగా సంజును ప్రకటిస్తారని సమాచారం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత్ జట్టు ఎటువంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. జూన్‌ నెలాఖరులో ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో కొత్త సీజన్‌ను ఆరంభించనుంది.

సంజు శాంసన్ విషయానికి వస్తే.. టీ20 ప్రపంచకప్‌ 2026లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం, ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అద్భుతంగా ఆడుతున్నాడు. అలానే గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. సంజూ వికెట్ కీపర్‌గా కూడా జట్టుకు అదనపు బలంగా ఉన్నాడు. ఈ కారణాలతో శాంసన్‌ వైపు బీసీసీఐ సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఐపీఎల్ 2026లో శాంసన్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 402 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి.

మరోవైపు ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుకు సారథిగా, ఆటగాడిగా రాణిస్తున్నప్పటికీ చాలాకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉండటం శ్రేయస్‌కు ప్రతికూలంగా మారిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ చివరి టీ20 మ్యాచ్‌ 2023 డిసెంబర్‌లో ఆడాడు. ఇంత విరామం తీసుకున్న అయ్యర్‌ను జట్టులోకి తీసుకుని నేరుగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం రిస్క్‌గా బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారని సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!