ePaper
Monday, October 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి

మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి

📰 Generate e-Paper Clip

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో తండ్రి చేతిలో కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

పశ్చిమగోదావరి మే 9 ( మహాప్రభ ) : అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో తండ్రి చేతిలో కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గణేశ్ ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గణేశ్ తరచూ మద్యం సేవించడంతో ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించిన గణేశ్ తన కొడుకు శామ్యూల్‌ రాజు(19)పై దాడి చేశాడు. కత్తెరతో శామ్యూల్‌పై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే అత్తిలి పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడు గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్న కొడుకును తండ్రి అతికిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!