ePaper
Saturday, July 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

ఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి సీహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

విజయనగరం, ఫిబ్రవరి 28 మహాప్రభ : చీపురుపల్లి సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు(శనివారం) చీపురుపల్లి చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీహెచ్‌సీకి వెళ్లి.. అక్కడ విద్యార్థినిలతో ముచ్చటించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వల్ల గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని వివరించారు. సీఎం సమక్షంలో 14 ఏళ్ల లోపు విద్యార్థినిలకు ఏఎన్ఎమ్‌లు వ్యాక్సిన్ వేశారు.హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఉపయోగాల గురించి విద్యార్థినిలకు వివరించి చెప్పారు సీఎం. క్యాన్సర్ రాకుండా రక్షణ కోసమే ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల్లో వ్యాక్సినేషన్ డేటాను నమోదు చేయాలని సీఎం సూచించారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆసుపత్రికి అడ్వైజరీ కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!