ఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి సీహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయనగరం, ఫిబ్రవరి 28 మహాప్రభ : చీపురుపల్లి సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు(శనివారం) చీపురుపల్లి చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీహెచ్‌సీకి వెళ్లి.. అక్కడ విద్యార్థినిలతో ముచ్చటించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వల్ల గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని...