ePaper
Monday, April 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.

స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ చేతులెత్తేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఓటమి అనంతరం ఎల్ఎస్‌జీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ జట్టు ప్రదర్శన, తన గాయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు

గాయం గురించి ప్రస్తావిస్తూ.. ఎడమ చేయి గాయం (Left elbow) మానుతుందని, ఈ లోపే కొత్త గాయం (right hand) అయిందని పంత్ అన్నాడు. అయినా పాజిటివ్‌గా తీసుకుంటానని వెల్లడించాడు. ఇక ఓటమి గురించి మాట్లాడుతూ.. ‘ మా బౌలర్లు చక్కగా బౌలింగ్‌ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో ప్రతికూల అంశాలే కాకుండా అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. వాటిని బిల్డ్‌ చేసుకోవాలి. పంజాబ్‌ కింగ్స్‌ చాలా బాగా ఆడింది. వారికి క్రెడిట్‌ ఇవ్వాలి’ అని పంత్ వెల్లడించాడు.

‘ఆయుష్ బదోనిని ఈసారి ఓపెనర్‌గా పంపించాం. ఇది ఈ మ్యాచ్‌కు ముందు తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజుల క్రితమే అనుకున్నాము. టాపార్డర్‌కు ఫ్రీడం ఇవ్వాలని, మిడిలార్డర్‌ వారికి మద్దతుగా ఉండాలన్నదే ఉద్దేశంతోనే ఓఓపెనర్‌గా పంపాం. ప్రత్యర్థి జట్టు మెరుగ్గా ఆడినప్పుడు మనం ఎంత చేసినా ఫలితం రాదు. ఓడినప్పటికీ మా జట్టుపై నమ్మకం ఉంది. ప్రతి మ్యాచ్‌లో పాజిటివ్‌గా ఆడి, మెరుగుపడాలనుకుంటున్నాము’ అని పంత్ పేర్కొన్నాడు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!