ePaper
Monday, April 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గన్‌ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయం

గన్‌ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయం

📰 Generate e-Paper Clip

కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద పోలీసు అధికారి గన్ మిస్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు ఛాతిలోంచి బుల్లెట్ బయటకు వచ్చింది.

కాకినాడ ఏప్రిల్ 20 (మహాప్రభ) : కాకినాడలో గన్‌ మిస్‌ఫైర్ కలకలం రేపింది. కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి గన్ మిస్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు ఛాతిలోంచి బుల్లెట్ బయటకు వచ్చింది. ఈవీఎం గోదాం భద్రతా డ్యూటీలో ఉన్న సమయంలో అతని తుపాకీ ఆకస్మికంగా మిస్‌ఫైర్ అయింది. దీంతో హెడ్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయం అయ్యింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన ధనరాజును వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

వైద్యులు అత్యవసర చికిత్స అందించి హెడ్‌ కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ధనరాజు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాపాయం తప్పినందుకు అతని కుటుంబం, సహచరులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యా ప్రయత్నమా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!