ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వేసవిలో కాస్త ఉపశమనం.. భారీ వర్షంతో ప్రజలకు ఊరట

వేసవిలో కాస్త ఉపశమనం.. భారీ వర్షంతో ప్రజలకు ఊరట

📰 Generate e-Paper Clip

కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కురిసింది.

కాకినాడ జిల్లా ఏప్రిల్ 8 (మహాప్రభ) : కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కురిసింది.

ఉక్కపోత నుంచి ఉపశమనం

గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులతో సతమతమవుతున్న తుని ప్రజలకు ఈ వర్షం పెద్ద ఊరటనిచ్చింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వాన కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు, పాదచారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో తునిలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ అకాల వర్షం కొన్ని రకాల పంటలకు మేలు చేస్తుందని రైతులు భావిస్తుండగా, మరికొన్ని చోట్ల ధాన్యం ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరికొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన.. 

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం లేదా వాతావరణ మార్పుల వల్ల ఈ వర్షం కురిసి ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న కొన్ని గంటల్లో జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం లభించినప్పటికీ, అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!