ePaper
Saturday, June 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో డయేరియా ప్రబలడంతో మున్సిపాలిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగామలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు.

ఎన్టీఆర్‌ జిల్లా, మార్చి 31 (మహాప్రభ) : నందిగామ మున్సిపాలిటీ పరిధిలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలు నిలిచిపోనున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని చందాపురం గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలుతుండటంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాంసం విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించారు. నందిగామ పురపాలక సంఘం పరిధిలోని అన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రీ పాయింట్లలో మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. కోడి, మేక, గొర్రె, చేపల అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఏప్రిల్ 8 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీ అధికారులు స్పష్టం చేశారు. నందిగామలో డయేరియా కారణంగా జ్వరాలు, విరేచనాలతో చాలా మంది ఆస్పత్రిలో చేరారు. మరికొందరికి ఇళ్ల వద్దే చికిత్స అందజేస్తున్నారు వైద్యులు. డయేరియా ప్రబలడంతో అప్రమత్తమైన మున్సిపాలిటీ అధికారులు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు అధికారులు సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!