ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో డయేరియా ప్రబలడంతో మున్సిపాలిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగామలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. ఎన్టీఆర్ జిల్లా, మార్చి 31 (మహాప్రభ) : నందిగామ మున్సిపాలిటీ పరిధిలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలు నిలిచిపోనున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని చందాపురం గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలుతుండటంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాంసం విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించారు. నందిగామ పురపాలక సంఘం పరిధిలోని అన్ని హోటల్స్,...