ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరాజకీయంనాకు మంత్రి పదవి అవసరం లేదు కానీ ఇస్తే మంచిదే: రాజగోపాల్ రెడ్డి

నాకు మంత్రి పదవి అవసరం లేదు కానీ ఇస్తే మంచిదే: రాజగోపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్, మార్చి 24 మహాప్రభ : మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) వ్యాఖ్యానించారు. హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు. తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ మీడియా పాయిట్‌లో ఆయన మాట్లాడారు. ఏ పదవి లేకున్నా తనకి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు.

పార్టీకి మేలు..

తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తన లాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమని తెలిపారు. తనకు సీఎం రేవంత్‌రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు. నిన్న సీఎంతో ప్రత్యేకంగా ఏం భేటీ లేదని, ఎదురుపడితే పలకరించుకున్నామని చెప్పారు. మాజీమంత్రి కేటీఆర్‌తో ఇవాళ కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడానని వివరించారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని కేటీఆర్‌కు చెప్పానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!