ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరాజకీయంఆ సంస్కృతి మీరే మొదలు పెట్టారు.. కేటీఆర్‌‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్

ఆ సంస్కృతి మీరే మొదలు పెట్టారు.. కేటీఆర్‌‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్, మార్చి 11 మహాప్రభ : తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు(KTR) కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Addanki Dayakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులకు బీజం వేసింది కేసీఆర్ కాదా? గతంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా, ఏకంగా మంత్రులను చేసిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై విమ్శలు చేసే ముందు బీఆర్ఎస్ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ దయాకర్ అన్నారు.జాతీయ స్థాయి నాయకుడైన రాహుల్ గాంధీపై కేటీఆర్ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ..‘ పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో మొదలు పెట్టింది కేసీఆర్. జాతీయ స్థాయి నాయకుడైన రాహుల్ గాంధీపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కావు. ఎక్కడో ఉన్న రాహుల్ గాంధీ ముచ్చట మీకెందుకు. ఒకప్పుడు ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని ఏకంగా మంత్రులను చేసిన సంస్కృతి మీది. మీ నాయకత్వం నచ్చకనే 10 మంది బయటికి వచ్చారు. కడియంతో పాటు పది మంది ఎమ్మెల్యేలను ప్రాధేయపడి మీ పార్టీలోకి ఆహ్వానించు. హరీష్ రావు, కేటీఆర్ మధ్య అంతర్గత గొడవ వల్ల పార్టీలో ఉండలేక పోతున్నామని మీ పార్టీ నేతలు చెబుతున్నారు. మీ పార్టీపై ఎవరికీ నమ్మకం లేదు.. బయటికి వెళ్లిన వాళ్లను మళ్లీ మీ పార్టీలో తెచ్చుకోగలరా? గతంలో కాంగ్రెస్ శాసన సభ పక్షాన్ని(CLP) బీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నావు. ఇప్పుడు నువు మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్, తెలుగుదేశం నుండి నీ పార్టీ‌లోకి వచ్చిన వాళ్ళు కాదా..! ప్రజలకి ఇబ్బంది ఐతే స్పందించే గుణం ప్రతిపక్షాలకి ఉండాలి..! అబద్ధపు రాజకీయ ప్రచారాలు కాదు’ అని అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!