ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవెల్‌కమ్‌..భైరవ్‌, విరాట్‌

వెల్‌కమ్‌..భైరవ్‌, విరాట్‌

📰 Generate e-Paper Clip

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్‌ జాతికి చెందిన భైరవ్‌, విరాట్‌ జాగిలాలు గురువారం విధుల్లోకి చేరాయి.

  • వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండు కొత్త జాగిలాలు
  • శిక్షణ కాలంలో బంగారు పతకాన్ని గెల్చుకున్న భైరవ్‌
  • గోల్డ్‌ మెడల్‌ అలంకరించిన సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌, ఫిబ్రవరి 27 మహాప్రభ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్‌ జాతికి చెందిన భైరవ్‌, విరాట్‌ జాగిలాలు గురువారం విధుల్లోకి చేరాయి. నూతన పోలీస్‌ జాగిలాలను పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన భైరవ్‌ జాగిలానికి సీపీ మెడల్‌ అలంకరించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ నూతన జాగిలాలు పేలుడు పదార్థాలను సులభంగా పసిగడితాయన్నారు ఈ శునకాలు చూడటానికి చిన్న అకారంలో వున్నప్పటికీ పెద్ద జాగిలాలు వెళ్ళలేని ప్రదేశాలు, మార్గాల్లోకి వెళ్ళి పేలుడు పదార్థాలను గుర్తుస్తాయని, ముఖ్యంగా విమానాల్లో ప్రయాణికుల సామాను భద్రపరిచే క్యాబిన్‌లలో, కార్ల కిందకు వెళ్ళి పేలుడు పదార్థాలను గుర్తించడం వీటి ప్రత్యేకతని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్రీనివాస్‌, రవి, ఏసీపీ సురేంద్ర, ఆపరేషన్స్‌ అర్‌.ఐ శ్రీనివాస్‌, డాగ్‌ స్వ్కాడ్‌ ఇంచార్జ్‌ ప్రభాకర్‌, బైరవ హ్యాండ్లర్‌ కుమారస్వామి, విరాట్‌ హ్యాండ్లర్‌ సాంబయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!