ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఘోరం.. మొదటి భర్తను నేనే అంటూ మహిళను..

ఘోరం.. మొదటి భర్తను నేనే అంటూ మహిళను..

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను మహేశ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.

హైదరాబాద్, ఫిబ్రవరి 18 మహాప్రభ: వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను మహేశ్ అనే వ్యక్తి అతికిరాతంగా హత్య చేశాడు. మృతురాలు సునీతగా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండు కత్తులతో, పెట్రోల్ డబ్బాతో చొరబడ్డాడు నిందితుడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే తగులబెట్టేస్తానంటూ హెచ్చరించాడు. చివరకు మహిళను తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హత్యకు గురైన మహిళ.. భర్త, తల్లితో కలిసి గ్రీన్‌సిటీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెట్రోల్ బాటిల్‌తో పాటు కత్తులతో ఇంట్లోకి ప్రవేశించాడు నిందితుడు మహేశ్. తల్లి బట్టలు ఆరేయడానికి టెర్రస్‌పైకి వెళ్లడంతో సునీత ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన మహేశ్.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంట్లో చల్లాడు. ఇంటిని తగలబెట్టేస్తానంటూ బెదిరించడంతో భయంతో సునీత కేకలు వేసింది. దీంతో ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు మహేశ్. తీవ్రంగా గాయపడిన సునీత ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం మహేశ్ బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు.సునీత అరుపులతో అప్రమత్తమైన పక్కంటి వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాత్రూం తలుపులు బద్దలుకొట్టి నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సునీతకు తాను మొదటి భర్త అని మహేశ్ చెబుతున్నాడు. తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నందుకు ఆమెను చంపానని నిందితుడు తెలిపాడు. అయితే, ప్రస్తుతం మృతురాలు సునీత మూడు నెలల గర్భిణి అని తెలుస్తోంది. 2022లో నిందితుడు మహేశ్‌తో సునీతకు విహహం జరుగగా.. కేవలం నెలరోజులు మాత్రమే వారిద్దరు కలిసున్నారని, ఆ తరువాత వారు విడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!