ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత.. వారిదే నిర్ణయమన్న హైకోర్టు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత.. వారిదే నిర్ణయమన్న హైకోర్టు

📰 Generate e-Paper Clip

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక స్టే ఎత్తివేసింది తెలంగాణ హైకోర్టు. ఈసీ, కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 18 మహాప్రభ: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్‌ అయ్యింది. మున్సిపల్ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఎత్తివేసింది. ఈసీ, కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఎన్నికపై రెండు రోజుల క్రితమే హైకోర్టు స్టే విధించగా.. దాన్ని ఎత్తివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.మరోవైపు ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్‌పై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. యాదగిరిని కోర్టు ముందు హాజరుపర్చారు ఇబ్రహీపట్నం పోలీసులు. అతడి స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డ్ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు తనను బలవంతంగా చీరాలకు తీసుకెళ్లి రిసార్ట్‌లో బంధించారని, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు దాదాపు 12 గంటల పాటు హైదరాబాద్‌ మొత్తం తిప్పి చీరాలకు తీసుకెళ్లారని యాదగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!