ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత.. వారిదే నిర్ణయమన్న హైకోర్టు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక స్టే ఎత్తివేసింది తెలంగాణ హైకోర్టు. ఈసీ, కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. హైదరాబాద్, ఫిబ్రవరి 18 మహాప్రభ: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఎత్తివేసింది. ఈసీ, కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఎన్నికపై రెండు రోజుల క్రితమే హైకోర్టు స్టే...