ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్వామ్మో! చైనా రోబోలు.. మనుషుల్నే మించిపోయాయిగా..

వామ్మో! చైనా రోబోలు.. మనుషుల్నే మించిపోయాయిగా..

📰 Generate e-Paper Clip

చైనా స్టార్టప్ సంస్థల రోబో ప్రదర్శన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. రోబోలు చేసిన డ్యాన్స్, మార్షియల్ ఆర్ట్స్ విన్యాసాలు చూసి జనాలు అబ్బురపడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి17 మహాప్రభ : చైనాలో సోమవారం సీసీటీవీ స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా (CCTV Spring Festival Gala) టీవీ షోలో రోబోల ప్రదర్శనలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Humanoid Robo Performances) అవుతున్నాయి. మనుషుల ఆకృతిలో రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ రోబోలు అచ్చు మనుషుల్లాగే డ్యాన్స్ చేయడం, గాల్లో పల్టీలు కొట్టడం ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.యూనీట్రీ రోబోట్రిక్స్ (Unitree), గాల్‌బాట్ (GalBat), నోయిటిక్స్, మేజిక్ ల్యాబ్(MagicLabs) అనే నాలుగు చైనా స్టార్టప్ సంస్థలు తమ హ్యూమనాయిడ్ మోడల్స్‌ను ఈ షోలో ప్రదర్శించాయి. మొదటి ప్రదర్శనలో కొన్ని రోబోలు ఏకంగా మార్షియల్ ఆర్ట్స్ చేసి చూపించాయి. యూనీట్రీ సంస్థ తమ రోబోలతో ఈ ప్రదర్శన చేసింది. సంక్లిష్ట ఫైటింగ్ సన్నివేశాలతో పాటు, మార్షియల్ ఆర్ట్స్ తరహాలో సమతౌల్యం కోల్పోకుండా చేసిన విన్యాసాలు జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు నోయెటిక్స్ రోబోలు కామెడీ స్కిట్ చేయగా, మేజిక్ ల్యాబ్స్‌కు చెందిన రోబోలు చేసిన డ్యాన్స్ షో జనాలను విశేషంగా ఆకట్టుకుంది.

త్వరలో ఈ సంస్థల్లో కొన్ని ఐపీఓకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోబో ప్రదర్శనలకు అమిత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక గతేడాది యూనీట్రీ రోబోల డ్యాన్స్ ప్రదర్శన కూడా జనాలను అమితంగా ఆకట్టుకుంది. మనుషుల పక్కనే నిలబడి అవి కర్చీఫ్‌లను గాల్లో తిప్పుతూ డ్యాన్స్ చేసిన వైనం చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి విశేష ప్రేక్షకాదరణ ఉంటుంది. వ్యూవర్‌షిప్ తరచూ 70 శాతాన్ని దాటిపోతుంటుంది. దీంతో అనేక సంస్థలు తమ తాజా ఉత్పత్తులను జనాలకు పరిచయం చేసేందుకు ఈ టీవీషోను వేదికగా చేసుకుంటాయి. ఈ షోలో టాప్ ప్రదర్శనలు ఇచ్చిన సంస్థలకు ప్రభుత్వ కాంట్రాక్టులతో పాటు ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా లభించే అవకాశాలు మెరుగవుతాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!