ePaper
Monday, April 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్శాంతి చర్చలకు బ్రేక్‌.. రావడం లేదని తెలిపిన ఇరాన్..

శాంతి చర్చలకు బ్రేక్‌.. రావడం లేదని తెలిపిన ఇరాన్..

📰 Generate e-Paper Clip

పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ నౌకాదళం తమ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ శాంతి చర్చల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది.

ఏప్రిల్ 20 (మహాప్రభ) :పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ నౌకాదళం తమ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ శాంతి చర్చల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది. 22వ తేదీతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది (Tehran skips talks).

కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే లోపు అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా శాంతి నెలకొంటుందని చాలా దేశాలు భావించాయి. అయితే ప్రపంచ దేశాల ఆశలు ఫలించలేదు. అమెరికా వైఖరి కారణంగానే శాంతి చర్చలకు వెళ్లడం లేదని టెహ్రాన్ పేర్కొంది. ఇరాన్‌ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నౌకపై తొలుత కాల్పులు జరిపి ఆపై అదుపులోకి తీసుకున్నాయి (US seizes Iranian ship). అమెరికా తమ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది (Iran US talks). ఈ చర్యను ఇరాన్‌పై దాడిగా భావిస్తూ త్వరలోనే ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇస్లామాబాద్‌లో మలి విడత చర్చలకు రావడం లేదని ఇరాన్ తెలిపింది. అలాగే ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా దిగ్బంధనం కొనసాగించడం, శాంతి చర్చల నేపథ్యంలో అగ్రరాజ్యం పెట్టిన డిమాండ్లు కూడా ఇరాన్‌కు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో రెండో దఫా శాంతి చర్చలు ప్రారంభం కాకుండానే విఫలమైనట్టు కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!