ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా అదే: సునీల్ గావస్కర్

అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా అదే: సునీల్ గావస్కర్

📰 Generate e-Paper Clip

టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ అంశంపై స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి17 మహాప్రభ: టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్‌ అయ్యాడు. నమీబియాతో మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా మైదానంలోకి దిగలేదు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాల్సిన అభిషేక్.. శ్రీలంకలో పాక్‌తో జరిగిన కీలక పోరులోనూ నిరాశపర్చాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. భారీ షాట్లకు ప్రయత్నించి ఔట్ అవ్వగుండా.. సింగిల్స్ కూడా తీయాలని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ అంశంపై స్పందించాడు.

‘అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా ఒకటే.. అతడు మొదట సింగిల్ తీయాలి అంతే. అప్పుడు కాళ్లు కూడా కదులుతాయి. తర్వాత వేగంగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించాలి. అతడు న్యూజిలాండ్‌పై మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫామ్, టచ్‌లో ఉన్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి క్రీజులో కుదురుకున్న తర్వాత పెద్ద షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాలి. అతడి నుంచి మనం అదే చూడాలనుకుంటున్నాం’ అని సన్నీ పేర్కొన్నాడు.ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీమిండియా సూపర్ 8కి చేరుకుంది. గ్రూప్ స్టేజిలో ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌లో అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. కాగా ఆదివారం పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!