ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే..

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే..

📰 Generate e-Paper Clip

అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక కేంద్రమైన అచ్యుతాపురం జంక్షన్ సమీపంలోని కేఆర్ మార్ట్‌లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి..

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి17 మహాప్రభ : అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక కేంద్రమైన అచ్యుతాపురం జంక్షన్ సమీపంలోని కేఆర్ మార్ట్ (KR Mart)లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం (Achyutapuram fire incident) సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మార్ట్ లోపల అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన సిబ్బంది, వినియోగదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పివేస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే…

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. మార్ట్‌లోని వస్తువుల్లో ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో మంటలు క్షణాల్లో ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులను అప్రమత్తం చేశారు.

నష్ట నివారణ..

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మార్ట్‌లోని వస్తువులన్నీ కాలి బూడిదవ్వడంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని యాజమాన్యం అంచనా వేస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఇంకా మంటలను పూర్తిగా అదుపు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!