ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ఇదేందయ్యా ఇది.. పెళ్లిలో ఇలాంటివి కూడా ఇస్తారా.. చూస్తే షాకవ్వాల్సిందే.. : Mahaaprabha

ఇదేందయ్యా ఇది.. పెళ్లిలో ఇలాంటివి కూడా ఇస్తారా.. చూస్తే షాకవ్వాల్సిందే.. : Mahaaprabha

📰 Generate e-Paper Clip

సాధారణంగా పెళ్లిలో అతిథులకు స్వీట్లు, నోరూరించే వంటకాలు అందిస్తారు. ధనవంతులైతే తమ స్థాయికి తగినట్టు విందు భోజనంతో పాటు మరికొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఖరీదైన బహుమతులు ఇస్తారు.సాధారణంగా పెళ్లిలో అతిథులకు స్వీట్లు, నోరూరించే వంటకాలు అందిస్తారు. ధనవంతులైతే తమ స్థాయికి తగినట్టు విందు భోజనంతో పాటు మరికొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఖరీదైన బహుమతులు ఇస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వివాహ వేడుకలో అతిథుల కోసం విచిత్రమైన ఏర్పాట్లు చేశారు. ఆ వీడియో చూస్తే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే (viral wedding video).ca_vanshika_curates అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పెళ్లికి హాజరైన అతిథులకు ఒక వెయిటర్ సిగరెట్లు, బీడీలు, గుట్కా ప్యాకెట్లను ఒక ట్రేలో అమర్చి అందిస్తున్నాడు. అతిథులు వాటిని తీసుకుని అక్కడే పొగ తాగుతున్నారు. ఈ వెరైటీ సాంప్రదాయం పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, గర్హ్వాల్‌లోని కొన్ని ప్రాంతాలలో ఎప్పట్నుంచో ఉందని కొందరు కామెంట్లు చేశారు. ఆ వివాహానికి హాజరైన వంశిక అనే వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (cigarettes distributed at wedding).ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (shocking wedding trend). లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. సంతోషాన్ని అలా సెలబ్రేట్ చేసుకోవడం తప్పుడు సంకేతాలను అందిస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి ఆచారాన్ని తాను ఎక్కడా చూడలేదని మరొకరు పేర్కొన్నారు. అంత మంది మధ్యలో పొగతాగడం చట్టరీత్యా నేరమని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!