ePaper
Wednesday, April 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు : Mahaaprabha

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు : Mahaaprabha

📰 Generate e-Paper Clip

ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు.

అమరావతి, ఫిబ్రవరి 12 మహాప్రభ : ఏపీ అసెంబ్లీలో(AP Assembly) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ జరగనుంది. ఈ చర్చను పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మద్దతు తెలపనున్నారు. శాసనసభలో నేటి ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. పుట్టపర్తిలో ఐఐఐటీ, నన్నయ విశ్వవిద్యాలయ పరిధిలో అనుమతులు లేని కళాశాలలు, పుత్తూరు పురపాలక సంఘం ఛైర్మన్‌పై విచారణ, గిరిజన ఉద్యోగుల బదిలీలు, లోచెర్ల – శివదావలస ఎత్తిపోతల పథకం అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం చెప్పనున్నారు.

బీఏసీ సమావేశాల నిర్ణయాలపై సీఎం చర్చ.. : గుత్తేదారుల పెండింగ్ బిల్లులు, అమలాపురం డిగ్రీ కళాశాల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాలు, ప్రభుత్వ సలహాదారులు, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల మెస్ ఛార్జీలు, తిరుపతి, తిరుమలకు తాగునీరు అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పనున్నారు. బీఏసీ సమావేశాల నిర్ణయాలను సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టనున్నారు. ఉభయ సభల్లో తమ శాఖలకు సంబంధించిన పత్రాలని మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ సుంకం 2025 సవరణ బిల్లు సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవ సవరణ ఆర్డినెన్స్‌ను సభలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు.

పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్‌‌పై డిప్యూటీ సీఎం చర్చ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్‌ను సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నారు. మోటార్ వాహనాల పన్ను విధింపు సవరణ ఆర్డినెన్స్‌ను రవాణా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల సవరణ ఆర్డినెన్స్‌ను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 59వ, 60వ, 61వ, 62వ వార్షిక నివేదికలను, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, 47వ వార్షిక నివేదిక ప్రతిని సభలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. సహకార శాఖ వార్షిక నివేదిక ప్రతిని సభలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.

శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై తీర్మానం, చర్చలు.. : శాసన మండలిలో నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు జరగనున్నాయి. ఈ చర్చని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ప్రారంభించనున్నారు. ఈ చర్చకు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి మద్దతు తెలపనున్నారు. శాసనమండలిలో పలు కీలక అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. స్మారక మ్యూజియంలు, సామాజిక భద్రతా పింఛన్లు, తహసీల్దార్ కార్యాలయ భవనాలకు మరమ్మతులు, కొత్త పింఛన్లు, 108, 104 అంబులెన్స్ సేవలు అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు చెప్పనున్నారు. ఏరియా ఆస్పత్రుల అభివృద్ధి, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి, పరిశ్రమలకు భూముల కేటాయింపు, ఆహార సలహా కమిటీలు, కౌంటర్ల వద్ద టీటీడీ దర్శన టికెట్లు తదితర ప్రశ్నలకు అమాత్యులు బదులివ్వనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!