ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణరెండో పెళ్లి చేసుకున్న అన్న.. అత్తకు కరెంట్ షాక్ ఇచ్చిన అల్లుడు.. : Mahaaprabha

రెండో పెళ్లి చేసుకున్న అన్న.. అత్తకు కరెంట్ షాక్ ఇచ్చిన అల్లుడు.. : Mahaaprabha

📰 Generate e-Paper Clip

ఫిబ్రవరి 10 మహాప్రభ : మహబూబాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. వదినపై కత్తితో దాడి చేశాడు. భార్య, తల్లిదండ్రులపై దాడికి యత్నించాడు..కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. వదినపై కత్తితో దాడి చేశాడు. భార్య, తల్లిదండ్రులపై దాడికి యత్నించాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లో వెళితే.. గార్ల మండలం సీతంపేట శివారు మంగళతండాకు చెందిన రమేశ్, రాజేశ్ అన్నాదమ్ముళ్లు. కొంతకాలం నుంచి ఆస్తి విషయంలో అన్నాదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రమేశ్.. అంజలి అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.అన్నకు రెండో పెళ్లి జరగటం వల్ల ఆస్తి తనకు దక్కదని రాజేశ్ భావించాడు. అన్నకు పిల్లనిచ్చిన అత్తామామలపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అన్న రెండో పెళ్లిపై కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకున్నాడు. అందరూ నిద్రపోయిన తర్వాత అత్త కంసాలి మెడకు విద్యుత్ వైరు చుట్టి కరెంట్ షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ నేపథ్యంలోనే అడ్డు వచ్చిన వదిన అంజలిపై కత్తితో దాడి చేశాడు. భార్య, తల్లిదండ్రులపై కూడా దాడి చేయడానికి యత్నించాడు. వారు తప్పించుకుని పారిపోయారు.అంజలి అరుపులు విన్న బంధువులు అక్కడికి వచ్చారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంసాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!