ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బతుకుపోరులో అలసి.. : Mahaaprabha

బతుకుపోరులో అలసి.. : Mahaaprabha

📰 Generate e-Paper Clip

పదేళ్ల వయసులో అమ్మానాన్న చనిపోయారు.. పసిపాప అనాథగా మిగిలిపోయింది. చిన్నమ్మ చేరదీసింది. కష్టాల కడలిలోనే పదేళ్లు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి చదివింది. చిన్నమ్మ తప్ప ఎవరూ లేరు.పదేళ్ల వయసులో అమ్మానాన్న చనిపోయారు.. పసిపాప అనాథగా మిగిలిపోయింది. చిన్నమ్మ చేరదీసింది. కష్టాల కడలిలోనే పదేళ్లు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి చదివింది. చిన్నమ్మ తప్ప ఎవరూ లేరు. ఉన్న ఆ దిక్కు కూడా దూరమైంది. మూడునెలల క్రితం ఆమె కూడా చనిపోయింది. ఆమె మళ్లీ అనాథగా మిగిలిపోయింది. ఈసారి ఎవరూ చేరదీయలేదు. బతుకు దుర్భరమైంది. ఉద్యోగాన్ని వెతుక్కుంటూ నగరానికెళ్లింది. పక్షంరోజులు అక్కడే ఉండింది. తిరిగి ఇంటికొచ్చింది. బతుకు అంధకారంగా మారింది. భవిష్యత్తు శూన్యం అనిపించింది. ఎవరూలేని ఈ లోకంలో ఉండలేక, కష్టాల బతుకు సాగించలేక తనువు చాలించింది. నడి ఊరిలో అనాథగా ఉరిపోసుకుంది.

తనకల్లు(అనంతపురం)ఫిబ్రవరి 10, మహాప్రభ : మండలకేంద్రంలోని ఇందిరానగర్‌లో రెడ్డిప్రసన్న (21) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెడ్డిప్రసన్న తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే మృతిచెందారు. ఒంటరిగా చిన్నమ్మ ఈశ్వరమ్మ వద్ద ఉంటుండేది. మూడునెలల క్రితం ఈశ్వరమ్మ కూడా మృతిచెందింది.వెటర్నరీ డిప్లొమా చదివిన రెడ్డిప్రసన్న ఇటీవలే ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి తనకల్లుకు వచ్చింది. ఒంటరితనాన్ని భరించలేక, జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. రెడ్డిప్రసన్న పెదనాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భర్త తీరుతో విసిగి..

గుంతకల్లు టౌన్‌: పట్టణంలోని భాగ్యనగర్‌ దండుమిట్టకు చెందిన షేక్‌ రుక్సార్‌ (27) ఆదివారం రాత్రి ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని కేకే నగర్‌కు చెందిన సయ్యద్‌షాహీద్‌ 8 ఏళ్ల క్రితం రుక్సార్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అనంతపురంలో ఉండేవారు. ఏడాది క్రితం గుంతకల్లుకు వచ్చి భాగ్యనగర్‌లోని దండుమిట్ట ఏరియాలో అద్దె ఇం ట్లో నివాసముంటున్నారు. షాహీర్‌ ఆటో నడుపుతూ జీవనంగా సాగిస్తున్నాడు. అతడు వ్యసనాలకు బానిసయ్యాడు. రోజూ మద్యం తాగుతూ భార్యాపిల్లలను పట్టించుకునేవాడు.ఆదివారం రాత్రి కూడా మద్యం మత్తులో ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్లి చచ్చిపో. అపుడు నేను రెండో పెళ్లి చేసుకుంటాన’ని భార్యను వేధించాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని, మరణించింది. ఫ్యాన్‌కు వేళాడుతున్న రుక్సార్‌ను ఉదయం గమనించిన భర్త, చుట్టుపక్కల వారి సాయంతో కిందకు దింపాడు. ఆమె అప్పటికే మృతిచెందింది. దీనిపై స్థానికులు.. వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రుక్సార్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. ఆమె తల్లి షేక్‌ భాను ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!