ePaper
Saturday, July 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్శంకర్‌ గౌడ్ మృతికి సీఎం రేవంత్‌ రెడ్డిదే బాధ్యత: హరీశ్ రావు

శంకర్‌ గౌడ్ మృతికి సీఎం రేవంత్‌ రెడ్డిదే బాధ్యత: హరీశ్ రావు

📰 Generate e-Paper Clip

ఆర్టీసీ కార్మికుడు శంకర్‌ గౌడ్‌ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ ఏప్రిల్ 24 (మహాప్రభ) : ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. శంకర్‌ గౌడ్ ఆత్మ బలిదానం తీవ్రంగా కలిచివేసిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మాజీ మంత్రి పోస్ట్ చేశారు. శంకర్‌ గౌడ్‌ మృతికి సీఎం రేవంత్‌ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

హరీశ్ రావు ట్వీట్..

‘ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు మా ఘన నివాళులు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. శంకర్‌ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత. ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడం వల్లనే ఈ దుస్థితి. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు? ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలి. శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మిక సోదరుల్లారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండి. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మరోసారి మనవి చేస్తున్నాం. జోహార్ శంకర్ గౌడ్’ అంటూ హరీశ్ రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!