శంకర్‌ గౌడ్ మృతికి సీఎం రేవంత్‌ రెడ్డిదే బాధ్యత: హరీశ్ రావు

ఆర్టీసీ కార్మికుడు శంకర్‌ గౌడ్‌ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఏప్రిల్ 24 (మహాప్రభ) : ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. శంకర్‌ గౌడ్ ఆత్మ బలిదానం తీవ్రంగా కలిచివేసిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మాజీ మంత్రి పోస్ట్ చేశారు. శంకర్‌ గౌడ్‌ మృతికి సీఎం రేవంత్‌...