ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్పెను విషాదం.. పుచ్చకాయ తిని నలుగురి మృతి?

పెను విషాదం.. పుచ్చకాయ తిని నలుగురి మృతి?

📰 Generate e-Paper Clip

ముంబైలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోయారు.

ముంబై ఏప్రిల్ 27 (మహాప్రభ) : మహారాష్ట్రలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల్లోకి వెళితే.. ముంబైలోని పైధోనీ ఏరియాకు చెందిన 40 ఏళ్ల అబ్దుల్లా దొకాడియా తన భార్య, ఇద్దరు కూతుళ్లతో మొఘల్ బిల్డింగ్‌లో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి ఫ్యామిలీ మొత్తం చిన్న పార్టీ చేసుకుంది. పార్టీ సందర్భంగా కుటుంబసభ్యులందరూ పుచ్చకాయ తిన్నారు.

పుచ్చకాయ తిన్న కొంతసేపటికే నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల నొప్పి, కడుపునొప్పి మొదలయ్యాయి. ఆదివారం ఉదయానికి అబ్దుల్లా ఇద్దరు కూతుళ్లు 16 ఏళ్ల అయేషా, 13 ఏళ్ల జైనాబ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అబ్దుల్, అతడి భార్య నస్‌రీన్ దొకాడియా నడవ లేని స్థితిలోకి వచ్చారు. ఇది గుర్తించిన పొరిగిళ్ల వారు నలుగురిని జేజే ఆస్పత్రికి తరలించారు. అయేషా, జైనాబ్‌లను పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అబ్దుల్, నస్‌రీన్‌లకు చికిత్స ప్రారంభించారు.  ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటలకు అబ్దుల్, నస్‌రీన్ కూడా చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరణాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!