పెను విషాదం.. పుచ్చకాయ తిని నలుగురి మృతి?
ముంబైలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోయారు. ముంబై ఏప్రిల్ 27 (మహాప్రభ) : మహారాష్ట్రలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల్లోకి వెళితే.. ముంబైలోని పైధోనీ ఏరియాకు చెందిన 40 ఏళ్ల అబ్దుల్లా దొకాడియా తన భార్య, ఇద్దరు...