ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నేటితో ముగియనున్న విద్యా సంవత్సరం

నేటితో ముగియనున్న విద్యా సంవత్సరం

📰 Generate e-Paper Clip

ఈ విద్యా సంవత్సరం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి జూన్‌ 11 వరకు ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది.

చిత్తూరు ఏప్రిల్ 23 (మహాప్రభ) : ఈ విద్యా సంవత్సరం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి జూన్‌ 11 వరకు ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చివరి రోజున విద్యార్థులకు ప్రొగ్రెస్‌ రిపోర్టులు ఇవ్వనున్నారు. వారిని ఉన్నత తరగతులకు ప్రయోట్‌ చేసి, పాఠశాలల్లో నమోదు శాతం పెంచనున్నారు. ఈసందర్భంగా డీఈవో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ పాసైన ప్రతి విద్యార్థిని ఉన్నత తరగతులకు పంపడంతో పాటు అంగన్‌వాడీలోని చిన్నారులను ఒకటవ తరగతిలో చేర్చనున్నామన్నారు.

బడిబాట కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. జూనియర్‌ కాలేజి విద్యా సంవత్సరం కూడా గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ ఒకటి నుంచి జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. డిగ్రీ కళాశాలలకు మే ఒకటి నుంచి జూన్‌ 14 వరకు వేసవి సెలవులు ఉండగా, జూన్‌ 15వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!