ePaper
Tuesday, August 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeగాడిదలు మేపుతున్న పీఎంకే మాజీ ఎమ్మెల్యేగాడిదలు మేపుతున్న పీఎంకే మాజీ ఎమ్మెల్యే

గాడిదలు మేపుతున్న పీఎంకే మాజీ ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ గాడిదలు మేపుతున్నారు.

చెన్నై మే 8 ( మహాప్రభ ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ గాడిదలు మేపుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్‌ రాందాస్‌ పార్టీ తరపున సేలం పశ్చిమ నియోజకవర్గం నుంచి అరుల్‌ పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ టీవీకే అభ్యర్థి లక్ష్మణన్‌ విజయం సాధించగా, అరుల్‌కు కేవలం 12,391 ఓట్లు మాత్రమే పోలవడంతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అరుల్‌…ఇపుడు తిరిగి తన సొంత పనుల్లో నిమగ్నమయ్యారు.

ఈ విషయంపై ఆయన శుక్రవారం తన ఫేస్‌బుక్‌లో గాడిదలు, గుర్రాలు, పశువులతో తానువున్న ఫొటో షేర్‌ చేశారు. ‘మన పని చేసుకునేందుకు మన తోటలో గేదెలు, దున్నపోతులు, గుర్రాలు, గాడిదలను మేపే పనిలో బిజీగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. పైగా ఎన్నికల్లో ఓడిపోతే గాడిదలు మేపేందుకు వెళతానని ఆయన ఎన్నికల ప్రచారంలోనే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!