వేసవిలో ఇంటిని చల్లగా ఉంచేందుకు ఎక్కువ మంది కూలర్‌ను ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు కూలర్ నుంచి వచ్చే దుర్వాసన ఇబ్బందిగా మారుతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే ఈ వాసనను త్వరగా తొలగించుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 29 (మహాప్రభ) : వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడానికి చాలా మంది కూలర్‌ను ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు కూలర్ ఆన్ చేసిన వెంటనే గదిలో చెడు వాసన రావడం మొదలవుతుంది. నీరు ఎక్కువ రోజులు మార్చకుండా ఉండటం వల్ల సూక్ష్మజీవులు పెరిగి దుర్వాసన వస్తుంది. అయితే, కొన్ని సింపుట్ చిట్కాలతో ఈ దుర్వాసనను తొలగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెనిగర్ ఉపయోగించండి
ముందుగా కూలర్‌లోని నీటిని పూర్తిగా ఖాళీ చేయాలి. తర్వాత తెల్ల వెనిగర్ పోసి కొంతసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బాగా రుద్ది శుభ్రం చేయాలి. వెనిగర్ బ్యాక్టీరియాను తొలగించి దుర్వాసనను తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా ఉపయోగించండి
కూలర్ నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి కూలర్‌ను శుభ్రం చేస్తే బ్యాక్టీరియా నశిస్తుంది.
ముఖ్య సూచనలు
- కూలర్ నీటిని ప్రతి 2–3 రోజులకు ఒకసారి మార్చాలి.
- కూలర్‌ను తరచుగా శుభ్రం చేయాలి.
- సరైన శుభ్రత పాటిస్తే కూలర్ నుంచి వచ్చే దుర్వాసన సమస్యను సులభంగా తొలగించవచ్చు.
