ePaper
Wednesday, April 22, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
HomeIran US tensionsఇరాన్‌తో చర్చలు ఇప్పట్లో లేనట్టేనా.. పాక్ పర్యటనపై వైట్‌హౌస్ కీలక ప్రకటన..

ఇరాన్‌తో చర్చలు ఇప్పట్లో లేనట్టేనా.. పాక్ పర్యటనపై వైట్‌హౌస్ కీలక ప్రకటన..

📰 Generate e-Paper Clip

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్థాన్ పర్యటనపై వైట్ హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక ప్రకారం జరగాల్సిన పర్యటన వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించింది. చర్చలకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఏప్రిల్ 22 (మహాప్రభ) :అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్థాన్ పర్యటన వాయిదా పడినట్టు వైట్ హౌస్ ప్రకటించింది. చర్చలకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం గడువును పొడిగించిన సంగతి తెలిసిందే (JD Vance Pakistan visit cancelled).

కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియడానికి ముందే శాంతి చర్చల కోసం వాన్స్ బృందం పాకిస్థాన్‌లో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు జేడీ వాన్స్ బృందం సిద్ధమైంది. అయితే తమ నౌకా రవాణాపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తి వేస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా పడింది. అయితే ఈ పర్యటన పూర్తిగా రద్దు కాలేదని, వాయిదా పడిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి (Trump ceasefire extension). ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ పొడిగింపు కారణంగా తక్షణ చర్చల అవసరం తగ్గింది (US Iran ceasefire news). కాగా, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినప్పటికీ, హోర్ముజ్ వద్ద తమ దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!