ePaper
Monday, October 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 7 (మహాప్రభ) : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. సిడ్నీలోని మారౌబ్రా ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ర్యాండమ్ బ్రీత్ టెస్టింగ్ నిర్వహించారు. దాన్ని గమనించిన వార్నర్ తన వాహనాన్ని చెక్ ‌పోస్ట్‌కు ముందే పార్క్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వార్నర్ దగ్గరకు వెళ్లి బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేశారు.

ఇందులో అతడు పరిమితికి మించి మద్యం తాగినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి. పోలీస్ స్టేషన్‌లో చేసిన పరీక్షలో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో అనుమతించిన పరిమితికి రెండింతలు ఎక్కువగా ఉండటంతో, కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడిచిపెట్టారు. వచ్చే నెల కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన పీఎస్ఎల్‌లో అతని భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో తాత్కాలికంగా ఆస్ట్రేలియాకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. కాగా వార్నర్ మళ్లీ పాక్‌కి వెళ్తాడా? లేదా? అనేది సందేహంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!