ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహిఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి

ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి

📰 Generate e-Paper Clip

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి ప్రపంచ వేదికపై మెరవనున్నారు. గతంలో ఫిఫా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన నోరా.. ఇప్పుడు ప్రారంభ వేడుకల్లో మెరవనున్నారు. కేవలం డ్యాన్స్‌తో కాకుండా ఈసారి పాట కూడా పాడనుండటం విశేషం.

ఇంటర్నెట్ డెస్క్ మే 9 ( మహాప్రభ ) : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి ప్రపంచ వేదికపై మెరవనున్నారు. గతంలో ఫిఫా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన నోరా.. ఇప్పుడు ప్రారంభ వేడుకల్లో మెరవనున్నారు. కేవలం డ్యాన్స్‌తో కాకుండా ఈసారి పాట కూడా పాడనుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఈ ఈవెంట్‌లో చోటు దక్కించుకోవడం ఆమె కెరీర్‌లోనే మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకల్లో నోరా పాల్గొననున్నారనే విషయాన్ని ఫిఫా ఎక్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న అంతర్జాతీయ స్టార్ల జాబితా విడుదల చేయగా.. అందులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి పేరు కూడా ఉండటంతో అభిమానులు సంబరపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ ప్రారంభ వేడుక కెనడాలోని టోరంటోలో జరగనుంది.

ఇదిలా ఉంటే, ఫిఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లు జూన్ 11న ప్రారంభం కానున్నాయి. జులై 19 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగనుంది. 39 రోజుల పాటు జరిగే ఈ టోర్నీకి కెనడా, మెక్సికో, యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిఫా వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు 32 దేశాలే పాల్గొంటుండగా.. ఈసారి 48 దేశాలు పొటీ పడనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జులై 19న అమెరికాలోని న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!