ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

📰 Generate e-Paper Clip

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు(అనంతపురం)  మే 8 ( మహాప్రభ ) : ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్కోడగామా-జైసిద్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (నం. 17321) రైలును జూన్‌ 12న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం.17322)ను జూన్‌ 15వ తేదీన రద్దుపరిచామన్నారు. యశ్వంతపూర్‌-కోర్బా (నం. 12251) ఎక్స్‌ప్రెస్‏ను జూన్‌ 9, 12 తేదీల్లో, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 12252)ను జూన్‌ 11, 14 తేదీల్లో రద్దు చేశామన్నారు.

ప్రత్యేక రైలు పాక్షిక రద్దు

వాస్కోడగామా-జైసిద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక రైలును పాక్షికంగా రద్దుచేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రైల్వేలోని కాస్టిల్‌ రాక్‌-కెలేం ఘాట్‌ సెక్షన్‌లో లైన్‌ బ్లాక్‌ అయిన కారణంగా ఈ రైలును ధార్వాడ వరకే నడపనున్నట్లు తెలిపారు. వాస్కోడగామా-జైసిద్‌ (నం. 17321) రైలును ఈనెల 8, 15, 22, 29, జూన్‌ 5 తేదీల్లో వాస్కో నుంచి కాకుండా ధార్వాడ నుంచి నడపనున్నట్లు తెలియజేశారు. వాస్కో-ధార్వాడ సెక్షన్‌లో రైలును పాక్షికంగా రద్దుపరిచామన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 17322)ను ఈనెల 11, 18, 25, జూన్‌ 1 తేదీల్లో జైసిద్‌-ధార్వడ సెక్షన్‌లో మాత్రమే నడుపుతామన్నారు. ధార్వడ-వాస్కో సెక్షన్‌లో రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!