ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఘజియాబాద్‌లోని 'గౌర్ గ్రీన్'లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

ఘజియాబాద్‌లోని ‘గౌర్ గ్రీన్’లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

📰 Generate e-Paper Clip

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం ఇందిరాపరంలోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

లఖ్‌నవూ ఏప్రిల్ 29 (మహాప్రభ) : ఘజియాబాద్‌లోని ఇందిరాపరం గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగసిపడిన మంటలు పక్క ఫ్లాట్లకు కూడా విస్తరించాయి. దీంతో భయాందోళనకు గురైన నివాసితులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ తమ ఫ్లాట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అధికారులకు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!