ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

📰 Generate e-Paper Clip

ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచ మేటి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఈ కుర్రాడి ఆటకు ప్రపంచం మొత్తం ఫిదా అవుతుండగా.. శత్రు దేశం పాకిస్థాన్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 27 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచ మేటి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ బాదేసి అందరినీ మరోసారి ఆశ్చర్యపర్చాడు. అయితే ఈ కుర్రాడి ఆటకు ప్రపంచం మొత్తం ఫిదా అవుతుండగా.. శత్రు దేశం పాకిస్థాన్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. వైభవ్ బ్యాటింగ్‌ను చూసి పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమన్ నియాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘వైభవ్ సూర్యవంశీపై నాకు అనుమానముంది. అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. వైభవ్ బ్యాట్‌లో ఏదో ఏఐ చిప్ పెట్టారని నా సందేహం. ఇంత చిన్న వయసులో ఇలాంటి బ్యాటింగ్ చేయడం అసాధారణం. ఇంకాస్త వేగంగా ఆడితే స్ట్రైక్ రేట్ 300 దాటేది. ఇది కేవలం అతడి పవర్ కాదు.. టెక్నిక్. అతడు షాట్లు ఆడే విధానం చూడముచ్చటగా ఉంటుంది. విరాట్ కోహ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన సమయంలో వైభవ్ పుట్టి ఉండొచ్చు. అతడి భవిష్యత్తు ఎంత ప్రకాశవంతంగా ఉండనుందో ఊహించడం కూడా కష్టమే’ అని అని నియాజ్ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉండగా, వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 357 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. కాగా త్వరలోనే అతడిని టీమిండియాలోకి తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2026లో 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్.. ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ లీగ్‌లో ఆర్ఆర్ తన తదుపరి మ్యాచ్‌ను మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!