ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంఆ సడలింపులను కొనసాగించబోము.. యూఎస్ మంత్రి స్పష్టీకరణ

ఆ సడలింపులను కొనసాగించబోము.. యూఎస్ మంత్రి స్పష్టీకరణ

📰 Generate e-Paper Clip

ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన సడలింపులను ఇకపై కొనసాగించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా స్పష్టం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 25 (మహాప్రభ) : ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన ఆంక్షలను కొనసాగించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన వేళ రష్యా, ఇరాన్‌ క్రూడ్ ఆయిల్‌పై ఉన్న ఆంక్షలను యూఎస్ తాత్కాలికంగా పక్కన పెట్టింది. నౌకల్లో లోడ్ చేసిన ముడి చమురు, రవాణాలో ఉన్న క్రూడ్ ఆయిల్‌ను కోనుగోలు చేయవచ్చని అప్పట్లో అమెరికా పేర్కొంది. అయితే, ఈ సడలింపును ఇకపై కొనసాగించేది లేదని మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఇరాన్‌పై యూఎస్ దిగ్బంధనం గురించి కూడా మంత్రి బెసెంట్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్‌ నుంచి క్రూడ్ ఆయిల్ ఎగుమతులు నిలిచిపోయాయని అన్నారు. మరికొన్ని రోజుల్లో క్రూడ్ ఆయిల్ వెలికితీతకూ ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

ఇరాన్ ఆయిల్ పరిశ్రమపై ఇప్పటికే యూఎస్ పలు ఆంక్షలను విధించింది. చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్‌కు చెందిన సుమారు 40 షిప్పింగ్ సంస్థలు, రవాణా నౌకలపై యూఎస్ ఆంక్షలు విధించింది. చైనాకు చెందిన ఒక రిఫైనరీని కూడా టార్గెట్ చేసింది. ఆంక్షలను ఎదుర్కొంటున్న సంస్థలు, నౌకల్లో అధిక శాతం చైనాతో లావాదేవీలు జరిపినవేనని యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు కీలకమైన నెట్‌వర్క్‌లో ఇవి భాగమని అన్నారు.

ఇరాన్‌కు ప్రధాన ఆదాయవనరు అయిన ముడి చమురు రంగం నుంచి వచ్చే నిధులే గల్ఫ్ ప్రాంతంలో అస్థిరతకు ఆజ్యం పోస్తున్నాయని యూఎస్ ఆరోపిస్తోంది. ఇతర సంస్థలను అడ్డుపెట్టుకుని ముడి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు నిర్ణయాత్మక చర్యలను తీసుకుంటున్నామని అమెరికా ఆర్థిక శాఖ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!