ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి

ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి

📰 Generate e-Paper Clip

ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రులు దాడి చేశారు. ఆపై యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఏలూరు జిల్లా ఏప్రిల్ 23 (మహాప్రభ) : ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రులు దాడికి పాల్పడటం తీవ్ర ఉద్రిక్తతకు దారి చేసింది. తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంటపై దాడి చేసిన తల్లిదండ్రులు.. యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. స్థానికంగా నివసిస్తున్న సంజిత్.. కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన పద్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో గత నెల 20న ఏలూరులోని అంబేద్కర్ నవ సమాజ్ సొసైటీలో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

వివాహం అనంతరం తమకు ప్రాణహాని ఉందని ఈ జంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత రాత్రి సంజిత్ ఇంటి వద్దకు వచ్చిన పద్మ తల్లిదండ్రులు, వారి బంధువులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా జంటపై దాడి చేశారు. ఆపై పద్మను బలవంతంగా తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!