ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంపెట్రోల్ ధరలు భారీగా తగ్గించిన పాక్ ప్రభుత్వం.. కొన్ని నగరాల్లో ఉచిత రవాణా సౌకర్యం..

పెట్రోల్ ధరలు భారీగా తగ్గించిన పాక్ ప్రభుత్వం.. కొన్ని నగరాల్లో ఉచిత రవాణా సౌకర్యం..

📰 Generate e-Paper Clip

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌పై మరింత తీవ్రంగా పడింది.

ఏప్రిల్ 4 (మహాప్రభ) :పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌పై మరింత తీవ్రంగా పడింది. ఇలాంటి సంక్షోభ సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాగ్రహాన్ని చల్లబరిచేందుకు చమురు ధరలను భారీగా తగ్గించింది (Pakistan petrol price cut).

పాకిస్థాన్‌లోని పెట్రోల్ ధరలను 80 పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) మేర తగ్గిస్తూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అలాగే రాజధాని నగరంలోనూ, అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్‌లలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా రవాణా వచ్చే నెల రోజుల పాటు ఉచితంగా ఉంటుందని తెలిపారు. ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం పాక్ ప్రభుత్వం పెట్రోల్‌పై 43 శాతం, హైస్పీడ్ డీజిల్‌పై 55 శాతం సుంకాల పెంపును ప్రకటించింది. దీంతో పెట్రోల్ ధర 458 పీకేఆర్‌కు, హైస్పీడ్ డీజిల్ ధర 520 పీకేఆర్‌కు చేరింది (Shehbaz Sharif fuel crisis).

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు భగ్గుమన్నారు (Pakistan energy crisis 2026). పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. పెట్రోల్‌పై 80 పీకేఆర్ మేర తగ్గిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి పాక్ ప్రధాని ప్రకటించారు. దీంతో పెట్రోల్ ధర 378 పీకేఆర్‌కు చేరింది. కనీసం ఒక నెల రోజుల పాటు ఈ ధరల్లో ఎటువంటి మార్పూ ఉండదని పాక్ ప్రధాని ప్రకటించారు. అయితే డీజిల్ ధరల్లో తగ్గింపును మాత్రం ప్రకటించలేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణా ఉచితం అని ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!