ePaper
Wednesday, April 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్ ఏప్రిల్ 1 (మహాప్రభ) : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమవారం రాత్రి ముసారాంబాగ్‌ కమ్యూనిటీహాల్‌లో జరిగిన బీజేపీ భాగ్యనగర్‌ జిల్లా కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముందుగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు అమలు చేయకుండా మోసం చేస్తుందని అన్నారు.

ఓటర్ల జాబితా సమగ్ర సర్వేలో బూత్‌ స్థాయి కార్యకర్తలు బీఎల్‌వోలతో కలిసి ఇంటింటికి వెళ్లి బోగస్‌ ఓటర్లను ఏరి వేయడంలో సహకరించాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోయే రోజుల్లో ఎప్పుడైనా వచ్చే అవకాశమున్నందున పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మీరెడ్డి, కొత్తకాపు అరుణరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు గౌర దేవేందర్‌, భాగ్యనగర్‌ జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి బొక్క మధుసూదన్‌రెడ్డి, సందడి సురేందర్‌రెడ్డి, తుమ్మలపల్లి రమే్‌షరెడ్డి, వై.సురేందర్‌, డివిజన్‌ అధ్యక్షుడు కొప్పుల దినేష్ పటేల్‌, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు అనుముల భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!